అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం అంతా మాట్లాడే రోజు వస్తుంది : చంద్రబాబు

భారత్ మండపంలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ రౌండ్ టేబుల్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.

By -  Medi Samrat
Published on : 20 Feb 2026 1:44 PM IST

అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం అంతా మాట్లాడే రోజు వస్తుంది : చంద్రబాబు

భారత్ మండపంలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ రౌండ్ టేబుల్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్న కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అంశంపై జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు చంద్రబాబు హాజరయ్యారు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు హాజరైన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్కే బ్రెండేతో కలిసి పాల్గొని ప్రసంగించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సమీప భవిష్యత్‌లో అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం అంతా మాట్లాడే రోజు వస్తుందన్నారు. గూగుల్ లాంటి సంస్థల రాకతో ఏపీలోని విశాఖపట్నం ఏఐ డేటా హబ్‌గా మారుతుందన్నారు. ప్రపంచానికి క్వాంటం కంప్యూటింగ్‌కు సంబంధించిన పరికరాలను కూడా తయారు చేసేలా క్వాంటం ఎకో సిస్టం రూపకల్పన జ‌రుగుతుంద‌న్నారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ఆకాంక్షతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారు.. దేశం దానిని సాధించి తీరుతుందన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలను సాధిస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. పౌరులందరికీ ప్రయోజనం కలిగేలా సావరిన్ ఏఐని వినియోగించేందుకు ప్రభుత్వంగా ప్రయత్నం చేస్తున్నామ‌న్నారు. డీపీ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు వెళ్లేలా ఏపీ దృష్టి సారిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్‌టెక్ పార్క్ లాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయని.. ఈ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించటంతో పాటు. క్వాంటం ఎకోసిస్టంను తీర్చిదిద్దుతున్నామ‌న్నారు.

Next Story