వచ్చే మూడేళ్లలోనూ విద్యుత్ ఛార్జీలు పెంచం.. సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్‌

విద్యుత్ రంగాన్ని గత పాలకులు విధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు.

By -  Medi Samrat
Published on : 13 Feb 2026 4:05 PM IST

వచ్చే మూడేళ్లలోనూ విద్యుత్ ఛార్జీలు పెంచం.. సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్‌

విద్యుత్ రంగాన్ని గత పాలకులు విధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడుతూ.. వచ్చే మూడేళ్లలోనూ విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. గత పాలకులు రూ. 32,166 కోట్ల భారాన్ని వినియోగదారులపై మోపారని.. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల విద్యుత్ వాడకుండానే సోలార్, విండ్ ప్రాజెక్టుల్లో రూ.9 వేల కోట్లు కట్టాల్సి వచ్చిందన్నారు. ఫ్యూయల్ సర్చార్జి భారం రూ.12,617 కోట్ల మేర వేశారని.. మొత్తంగా రూ. 1,22,422 కోట్లను గత ప్రభుత్వం విద్యుత్ బకాయిలు పెట్టి పోయిందన్నారు. 78 నుంచి 90 శాతం మేర కరెంటు ఛార్జీల భారం ప్రజలపై వేశారని.. మేం విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పాం.. దానికి కట్టుబడి ఉన్నామ‌న్నారు. రూ.4,860 కోట్ల ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంద‌ని.. ఆ భారాన్ని ప్రభుత్వమే కడుతుంద‌ని పేర్కొన్నారు.

శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామ‌ని సీఎం చంద్రబాబు హెచ్చ‌రించారు. రాజకీయ ముసుగులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. తిరుపతి లడ్డూ వ్యవహారం చాలా సున్నితమైన అంశమ‌ని.. కొందరు కావాలని దేవుడి పవిత్రతను, భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని ప్రయత్నించారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఒక్కసారైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీ.. జరిగిన తప్పులను చెప్పకుండా ఉంటే.. ఆ అపవిత్రతను కొనసాగించేందుకు వాళ్లు ఏమాత్రం వెనుకాడరు.. టీటీడీ సహా అన్ని దేవాలయాల్లో పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిందే కాక.. ఆ వివాదంలోకి హెరిటేజ్ సంస్థను తీసుకు వచ్చారన్నారు. వివేకా హత్య కేసు ఘటనలో ఎన్ని నాటకాలు ఆడారు.. సాక్షిపత్రికలో నారాసుర రక్త చరిత్ర అని రాశారు.. వాళ్లు చేసిన నేరాన్ని తప్పించుకోవడానికి ఇతరులపై నెట్టేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ సంస్థకు ముడిపెట్టి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. హెరిటేజ్ అనేది ఫ్యామిలీ బిజినెస్ లైవ్ లీ హుడ్ కింద వ్యాపారం చేస్తున్నారు.. బ్రాండ్ దెబ్బతీసేలా ఆ పత్రికలో అవాస్తవ కథనాలు ప్రచురిస్తున్నారన్నారు.

Next Story