తల్లి వ్యక్తిత్వాన్నే హననం చేయించినవారు నాయకులా.? : సీఎం చంద్రబాబు

వైసీపీ అధినేత జ‌గ‌న్ సోషల్ మీడియా సైకోలను తయారు చేశారని సీఎం చంద్రబాబు అన్నారు.

By Medi Samrat  Published on  15 Nov 2024 12:21 PM GMT
తల్లి వ్యక్తిత్వాన్నే హననం చేయించినవారు నాయకులా.? : సీఎం చంద్రబాబు

వైసీపీ అధినేత జ‌గ‌న్ సోషల్ మీడియా సైకోలను తయారు చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడుతూ.. కన్నతల్లిపైనా అసభ్యకర పోస్టింగులు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే ఏమనుకోవాలి.? కన్నతల్లి శీలాన్ని శంకించే పరిస్థితి ఉందంటే వాళ్లు మనుషులా.. పశువులా..? అని మండిప‌డ్డారు. తల్లి వ్యక్తిత్వాన్నే హననం చేసేవారికి మనం ఒక లెక్కా.? అని అన్నారు.

ఎన్డీయే కూటమిలోని నేతలు, కార్యకర్తలు ఎవరూ అసభ్య పోస్టులు పెట్టరు.. ఒకవేళ పెడితే కఠినంగా శిక్షిస్తాం అని హెచ్చ‌రించారు. ఆడబిడ్డలు గౌరవంగా బతికేలా చేస్తాం.. రాబోయే రోజల్లో ఏ ఆడబిడ్డా అవమాన పడటానికి వీళ్లేదన్నారు. చట్టానికి పదును పెట్టి కఠినంగా వ్యవహరిస్తామ‌న్నారు.

ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు. రాజకీయంలో అవినీతి చూసి ఉంటాం.. కానీ అవినీతి, అక్రమాలకే రాజకీయాల్లోకి వచ్చిన వారిని చూస్తున్నామ‌న్నారు. టీడీపీ స్థాపించి 45 ఏళ్లు అయింది.. ఇప్పటికీ మాకు టీవీ, పేపరు లేవు.. కానీ అధికారంతో అవన్నీ ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు.

రైతు బజార్లు, ఎమ్మార్వో కార్యాలయానికి తాకట్టు పెట్టారు. మద్య నిషేధం అని చెప్పి ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు 25 వేల కోట్లు.. కేంద్ర నిధులు దారి మళ్లించారు.. పేదల పథకాలకు గండికొట్టారన్నారు.

2019కి ముందు లోకేష్ 24 వేల కి.మీ సిమెంట్లు రోడ్లు వేయించారు.. కానీ గత అయిదేళ్లు ఏం చేశారో తెలీదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.4,500 కోట్లతో 30 వేల పనులకు శ్రీకారం చుట్టారు.. జల్ జీవన్ మిషన్ గొప్ప కార్యక్రమం.. ప్రతి ఇంటికి నీరివ్వడం ఈ పథకం లక్ష్యం.. 45 శాతం మేర కేంద్రం నిధులు ఇస్తుంది.. దాన్ని కూడా అస్తవ్యస్థం చేశారన్నారు.

ప్రయోగాలతో విద్యా వ్యవస్థను నాశనం చేశారు.. స్కూళ్లు విలీనం చేయడం వల్ల డ్రాప్ అవుట్ రేట్ పెరిగింది. ఇంగ్లీష్ మీడియం వాళ్లే ప్రవేశపెట్టినట్లు.. అంతక ముందు లేనట్లు ప్రవర్తించారన్నారు. ఎవరైనా మాట్లాడితే పేదలకులుగా చిత్రీకరించారు. వైద్య, వ్యవసాయ, అన్ని రంగాలను చిన్నచూపు చూసి నాశనం చేశారన్నారు.

Next Story