ఐదు రోజుల పర్యటన.. 29 కార్యక్రమాలు.. సింగపూర్‌లో సీఎం బిజీబిజీ

రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్ లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటించనున్నారు.

By Medi Samrat
Published on : 26 July 2025 7:00 PM IST

ఐదు రోజుల పర్యటన.. 29 కార్యక్రమాలు.. సింగపూర్‌లో సీఎం బిజీబిజీ

రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్ లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటించనున్నారు. శనివారం రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు ప్రయాణమవుతున్న సీఎం... జూలై 27 ఉదయం 6:25కి సింగపూర్ చాంఘీ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. సింగపూర్ కు చేరుకున్న అనంతరం తొలి గంట నుంచే ముఖ్యమంత్రి వివిధ పారిశ్రామిక వేత్తలు, సింగపూర్ లో భారత హై కమిషనర్ లతో వరుసగా భేటీ కానున్నారు.

కాగా, ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు మొత్తం 29 కార్యక్రమాలకు హాజరు కానున్నారు. అందులో 6 ప్రభుత్వ భేటీలు, 14 వన్-టు-వన్ సమావేశాలు. 4 సందర్శనలు, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 డయాస్పోరా, రోడ్‌షో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూలై 31 తేదీ సింగపూర్ హోం మంత్రి కే.షణ్ముగంతో పాటు స్థానిక ప్రతినిధులతో సమావేశం కానున్న సీఎం అదే రోజు రాత్రి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.

రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ఐటీ, పరిశ్రమలు, అర్బన్ డెవలప్‌మెంట్, క్రీడలు, నౌకాశ్రయాలు, ఫిన్‌టెక్ రంగాల్లో అనేక అంతర్జాతీయ భాగస్వామ్య అవకాశాలపై ముఖ్యమంత్రి చర్చలు జరుపుతారు. ఈ పర్యటన రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడుల రాకకు గేట్‌వేగా నిలవనుంది. క్రీడారంగం అభివృద్ధి, పోర్ట్ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ముందడుగు పడనుంది.

Next Story