వైఎస్సార్ హయాంలోనే తిరుమల అపవిత్రతకు బీజం..చంద్రబాబు సంచలన కామెంట్స్

టీటీడీ పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నాలు 2005లోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే మొదలయ్యాయని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.

By -  Knakam Karthik
Published on : 24 Feb 2026 2:59 PM IST

Andrapradesh, Cm Chandrababu, YSR, TTD, Tirumala

వైఎస్సార్ హయాంలోనే తిరుమల అపవిత్రతకు బీజం..చంద్రబాబు సంచలన కామెంట్స్

టీటీడీ పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నాలు 2005లోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే మొదలయ్యాయని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్లో తిరుమల ఏడు కొండలను కేవలం రెండు కొండలకే పరిమితం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీశాయని, దేశవ్యాప్త నిరసనల తర్వాతే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని ఆయన గుర్తుచేశారు. ఉడుపి పేజావర్ మఠాధిపతి విశ్వేశ తీర్థ స్వామీజీ డిమాండ్ మేరకు అప్పట్లో జస్టిస్ సిద్ధప్ప నేతృత్వంలో వేసిన కమిటీ నివేదిక ప్రకారం.. తిరుమలలో అన్యమత ప్రచారం, విద్యా సంస్థల్లో అన్యమతస్థుల ప్రమేయం, మాంసం, మద్యం విక్రయాలు వంటి అక్రమాలు జరిగినట్లు తేలిందని వివరించారు.

అంతేకాకుండా, అప్పట్లో టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్‌గాను, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీగాను క్రైస్తవులను నియమించారని చంద్రబాబు విమర్శించారు. తాజాగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీపై స్పందిస్తూ.. సిట్ (SIT) విచారణలో టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలు, నెయ్యిలో రసాయనాలు వాడిన అంశాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన ఈ అపచారం భక్తులందరికీ అత్యంత వేదన కలిగించే విషయమని, భవిష్యత్తులో అత్యున్నత ప్రమాణాలతో కూడిన స్వచ్ఛమైన నెయ్యినే ప్రసాద తయారీకి వాడతామని ఆయన స్పష్టం చేశారు.

Next Story