పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు కాపాడారు: మంత్రి సత్యకుమార్
పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు కాపాడారు..అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
By - Knakam Karthik |
పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు కాపాడారు: మంత్రి సత్యకుమార్
అమరావతి: పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు కాపాడారు..అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ..మొంథా తుపానుతో అత్యధిక సంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టం కలుగుతుందని ఆందోళన చెందారు. పై నుంచి కింది స్థాయి సచివాలయం వరకు సీఎం చంద్రబాబు నిరంతరం ముందస్తుగా అప్రమత్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్‌లో కూర్చుని తుపాను గమనాన్ని గమనిస్తూ తగిన ఆదేశాలు ఇచ్చారు. ప్రాణ నష్టం జరగకుండా ఎక్కువగా ఆస్తినష్టం జరగకుండా సీఎం ముందస్తు చర్యలు తీసుకున్నారు. పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు కాపాడారు. సీఎం చర్యలతో ప్రజలు అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రధాని మోదీ, కేంద్రం సైతం ఢిల్లీలోనూ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సహకారం అందించింది ..అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
సీఎం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం ద్వారా విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 2555 మంది గర్భిణులను ఆస్పత్రులకు తరలించి ప్రసవంకోసం వైద్యం అందించాం. తుపాను ప్రాంతాల్లో మందుల కొరత లేకుండా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్లోరినేషన్ చేస్తూ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకున్నాం. తుపాను ప్రాంతాల్లో 671 అంబులెన్సులు, 885-104 సంచార వాహనాలను అందుబాటులో ఉంచాం. ప్రజలు వ్యక్తిగత , పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ప్రజలు కాచి వడబోసిన నీటినే తాగాలి. రాబోయే నాలుగు రోజుల్లో చాల కీలకమైనవి .. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి..అని మంత్రి సత్యకుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.