రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి ప్రజలు అస్వస్థతకు గురికావడం మరియు మరణాల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా పాలు వినియోగించిన సుమారు 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ రిపోర్టులు వచ్చిన వెంటనే బాధ్యులైన పాల విక్రయదారులపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని అధికారులకు సూచించారు.