ఫ్యామిలీ కార్డ్ జారీపై సీఎం కీల‌క నిర్ణ‌యం

ఫ్యామిలీ బెన్ఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వ‌హించారు

By Medi Samrat
Published on : 28 Aug 2025 3:13 PM IST

ఫ్యామిలీ కార్డ్ జారీపై సీఎం కీల‌క నిర్ణ‌యం

ఫ్యామిలీ బెన్ఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వ‌హించారు. ఈ సమీక్షకు ఉన్నతాధికారులు హాజర‌య్యారు. ఫ్యామిలీ కార్డ్ జారీ చేయాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని సీఎం అధికారుల‌కు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న స్కీంలు సహా అన్ని వివరాలను ప్రభుత్వం ఫ్యామిలీ కార్డులో పొందుపరచనుంది. త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని సమీక్షలో సీఎం అధికారుల‌ను ఆదేశించారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఏయే కుటుంబానికి ఏమేం అవసరాలున్నాయోననే అంశాన్ని క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తీసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమం అవసరమైన వారికి వెంటనే అందేలా వ్యవస్థను సిద్దం చేయాలన్నారు. ప్రతి కుటుంబానికి ఇచ్చే ఫ్యామిలీ కార్డులో ప్రభుత్వం ఇచ్చే స్కీంల వివరాలను పొందుపరచండి.. ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డును ఉపయోగించుకోవాలన్నారు. కార్డులోని వివరాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ ఉండాలని స‌చించారు. త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలనుకుంటున్నామ‌ని.. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదన్నారు. అందరికీ లబ్ది కలిగేలా అవసరమైతే స్కీంలను రీ-డిజైన్ చేసే అంశాన్నీ పరిశీలిద్దామ‌న్నారు.

Next Story