14వ తేదీన చారిత్రక ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం.. నా రాజకీయ జీవితంలో ఇది అపూర్వ ఘట్టం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రం విధ్వంసానికి గురైంది.. ఇప్పుడు బ్రాండ్‌ను తిరిగి పునర్ నిర్మించామన్నారు. గూగుల్ సంస్థ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురాబోతోందని.. దేశంలో అతి పెద్ద డేటా హబ్‌గా విశాఖ మారబోతోందన్నారు.
ఓవైపు డేటా సెంటర్.. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్ రూపొందిస్తున్నామన్నారు. ఎప్పుడైనా ఈ స్థాయిలో పెట్టబడులు వస్తాయని ఊహించామా..? పరిశ్రమలకు కొందరు అడ్డుపడుతున్నారు.. ఇది మంచిది కాదు అన్నారు. ఇంకొందరు పెట్టుబడులు రాకుండా చేయడం.. బెదిరించడం ఫ్యాషన్‌గా మారింది.. నవంబరులో జరిగే పెట్టుబడుల సదస్సుకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తామన్నారు.