వారిని కాలగర్భంలో కలిపేస్తాం.. సీఎం చంద్రబాబు హెచ్చరిక

తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.

By Medi Samrat
Published on : 23 April 2025 6:09 PM IST

వారిని కాలగర్భంలో కలిపేస్తాం.. సీఎం చంద్రబాబు హెచ్చరిక

తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి వెళ్లిన చంద్రబాబు, వీరయ్య చౌదరి పార్థివదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు.

వీరయ్య చౌదరిని దారుణంగా హతమార్చారని, కరడుగట్టిన నేరస్తుల కంటే దారుణంగా హత్య చేశారని చంద్రబాబు నాయుడు అన్నారు. 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయంటే ఎలా చంపారో అర్థం చేసుకోవచ్చని, వారు భూమ్మీద ఉండేందుకు అనర్హులని అన్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనైనా పట్టుకుని తీరుతామని స్పష్టం చేశారు. వీరయ్య చౌదరి ఎంతో సమర్థుడైన నాయకుడని, పార్టీకి ఎన్నో సేవలు అందించారని చంద్రబాబు కొనియాడారు. వీరయ్యను చంపిన నిందితులను వదిలిపెట్టే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. హంతకుల కోసం 12 బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. టీడీపీ అధికారంలో ఉండి కూడా ఇలాంటి ఘోరాలు జరుగుతుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోతారని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

Next Story