ఏపీలో ఇంటింటికీ పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు..సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అడుగు వేశారు

By -  Knakam Karthik
Published on : 23 March 2026 5:00 PM IST

Andrapradesh, CM Chandrababu, AP Government, LPG Supply, PNG Connection, Gas Pipeline

ఏపీలో ఇంటింటికీ పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు..సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

అమరావతి: రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అడుగు వేశారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఎల్పీజీ సరఫరా మరియు అకాల వర్షాల పంట నష్టంపై నిర్వహించిన సమీక్షలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్యాస్ సిలిండర్లపై ఆధారపడటం తగ్గించి, ప్రతి ఇంటికీ పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లు ఇచ్చేలా తక్షణమే కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం శ్రీకాకుళం - కాకినాడ పైప్ లైన్ పునరుద్ధరణపై కేంద్ర మంత్రికి లేఖ రాయాలని స్పష్టం చేశారు.

వచ్చే కేబినెట్ సమావేశం నాటికి ‘నేచురల్ గ్యాస్ పాలసీ ఫర్ ప్రమోషన్ ఇన్ కమర్షియల్ సెక్టార్’ విధానాన్ని తీసుకురావాలని సీఎం సూచించారు. ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్‌లు, విద్యుత్ పరికరాల వినియోగం పెంచాలని, జిల్లాకు కనీసం 10 వేల చొప్పున కొత్త పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. మరోవైపు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఈ నెల 26వ తేదీలోగా పూర్తిస్థాయి పంట నష్టం నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

Next Story