విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు

By -  Knakam Karthik
Published on : 10 Dec 2025 12:21 PM IST

Andrapradesh, Cm Chandrababu, Ap Government, electricity tariff hike

విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

అమరావతి: విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీల సమావేశంలో స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పీపీఎలను రద్దు చేసి రూ.9 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో బహిరంగ మార్కెట్‌లో యూనిట్ విద్యుత్‌ను రూ.5.19 చొప్పున కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు దానిని రూ.4.92కు తగ్గించాం. మొత్తంగా రూ.9 వేల కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచుకోవడానికి ఈఆర్సీ అనుమతి ఇచ్చింది..అయినా ప్రజలపై భారం పడకూడదని నిర్ణయించాం. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచం.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం, ఐదేళ్లల్లో విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.4కు తగ్గించేలా కృషి చేస్తున్నాం. అందరం కలిసి సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం..ఒక్క పెన్షన్లలోనే ఇప్పటి వరకు రూ. 50 వేల కోట్లకు పైగా పేదలకు పంపిణీ చేశాం. ఏపీ బ్రాండ్ అనేది చాలా స్ట్రాంగ్ బ్రాండ్. గత పాలకుల వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది..అని సీఎం వ్యాఖ్యానించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ బ్రాండ్ తిరిగి తీసుకురాగలిగాం. విశాఖ సదస్సులో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. మన యువతకు ఉద్యోగాలు కూడా వస్తాయి. ఎప్పటికప్పుడు ఎస్ఐపీబీలు పెట్టుకుని పెట్టుబడులకు ఆమోదం తెలుపుతున్నాం. మొదటి త్రైమాసికంలో 12.02 శాతం గ్రోత్ రేట్ వచ్చింది. రెండో త్రైమాసికంలో 11.28 శాతం వృద్ధి నమోదు అయ్యింది. 8.70 శాతం జాతీయ సగటు కంటే ఎక్కువ ప్రగతి సాధించగలిగాం. ఇక భవిష్యత్ కాలానికి 17.11 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏపీ అభివృద్ధి గురించి పార్లమెంటులో చెప్పే స్థాయిలో మనం అభివృద్ధి చెందుతున్నాం. నీటి భద్రత విషయంలో ముందు చూపుతో పని చేశాం. సాగు నీటి ప్రాజెక్టుల్లో 944 టీఎంసీల నిల్వ చేసుకున్నాం. ఉన్నతాధికారులంతా శాస్త్రీయంగా ఆలోచన చేసి అభివృద్ధికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి.

రాష్ట్రాన్ని జోన్లుగా, రీజియన్లుగా, కారిడార్లుగా, క్లస్టర్లుగా, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. అన్ని శాఖలు, అన్ని ప్రభుత్వ సేవల్లో ప్రజల్లో సంతృప్త స్థాయిని నమోదు చేస్తున్నాం. ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలతో చక్కగా వ్యవహరించాలి. టీటీడీ పనితీరు మెరుగు అవుతోంది. కానీ దేవదాయ శాఖ పని తీరు మెరుగు పడడం లేదు. అన్ని ప్రభుత్వ శాఖలు ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి. జనవరి 15 నాటికి అన్ని సేవలూ ఆన్ లైన్లో పరిస్థితి రావాలి..అని సీఎం పేర్కొన్నారు.

Next Story