కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద జరిగిన బాణసంచా పేలుడు ఘటన ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి పెరిగింది. విద్యార్థినులకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు, అక్కడి నుంచి నేరుగా కాకినాడ జిల్లాలోని ప్రమాద స్థలానికి హెలికాప్టర్ లో బయలుదేరారు. ఘటనా స్థలిని పరిశీలించి, మృతుల కుటుంబాలను, బాధితులను ఆయన స్వయంగా పరామర్శించనున్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం.. తక్షణమే హోంమంత్రి అనితను, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, బాధితులకు మెరుగైన వైద్యం, అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. "
వేట్లపాలెం-జి.మేడపాడు మధ్య పొలాల్లో ఆరు షెడ్లు వేసి అడబాల వీరబాబు అనే వ్యక్తి ఈ బాణసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. మధ్యాహ్న భోజనం కోసం కొంతమంది కార్మికులు బయటకు వెళ్లడంతో వారి ప్రాణాలు దక్కాయి.