తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు బాధ్యులుగా చేస్తూ పలువురు అధికారులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేశారు. DSP రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డి బాధ్యత లేకుండా పనిచేశారని, వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటన జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ఉన్నా, వాళ్లు పనిచేయలేదని, ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి సహా మరొ అధికారిని వెంటనే బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.
వ్వక్తిగత అసమర్ధత, అనాలోచనతో దేవుని పవిత్రతతను దెబ్వతీస్తే తప్పు, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని చంద్రబాబు నాయుడు అన్నారు. కలియుగ దేవునికి మనం సేవ వేస్తున్నాం, జెరూసలెం క్రిష్టియన్లకు, మక్కా ముస్లింలకు ఉన్నట్లుగానే.. హిందువులకు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలనే కోరిక వుంటుందన్నారు చంద్రబాబు. డీఎస్పీ రమణ్ కుమార్ బాధ్యత లేకుండా పనిచేశారని, కొంత మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘటన జరిగిందని అన్నారు.