రాష్ట్రంలో P4 అమలుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ-పీ4 లక్ష్యం 2029 నాటికి సాకారం అవుతుందని.. ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
By Knakam Karthik
రాష్ట్రంలో P4 అమలుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
అమరావతి: పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ-పీ4 లక్ష్యం 2029 నాటికి సాకారం అవుతుందని.. ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన పీ4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. మంగళవారం సచివాలయంలో పీ4పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ నుంచి పీ4 అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
పేదరిక నిర్మూలనలో భాగంగానే పీ4 కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యంగా . సమాజానికి తిరిగి ఇవ్వాలన్నదే తన ప్రధాన ఉద్దేశం అన్నారు. మార్గదర్శుల నుంచి చిన్న ఆసరా పేదలకు కొండంత అండ అవుతుందని. ఆ స్పూర్తితోనే అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు పల్లెకుంట హేమలత మార్గదర్శిగా మారి ఓ వృద్ధురాలిని ఆదుకుంటున్నారని. ఈ సంధర్బంగా హేమలతను సీఎం చంద్రబాబు అభినందించారు. స్పందించే మనస్సు ఉంటే... పేదల్ని ఆదుకునేందుకు మానవత్వం చూపుతూ ముందుకు వస్తారన్నారన్నారు. డబ్బుతో పాటు.. సాయం చేసే వారు కూడా మార్గదర్శులే. బంగారు కుటంబాలకు కావాల్సింది ఎమోషనల్ బాండింగ్, చేయూత మాత్రమే. సీఎస్సార్ నిధులతో బిల్ గేట్స్, వేదాంత లాంటి సంస్థలు పనిచేస్తున్నాయని. వీటికి మించి కుటుంబాలను ఆదుకోవటమే లక్ష్యంగా పీ4 కార్యక్రమం చేపట్టామని. ప్రజలే ఆస్తిగా జీరో పావర్టీ మిషన్ అమలు చేస్తున్నాం." అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
బంగారు కుటుంబాలను ఆదుకోవటంలో మార్గదర్శుల ఎంపిక పూర్తిగా వాలంటరీగానే జరుగుతోందని. ఎక్కడా ఎవరిపైనా బలవంతం లేదన్నారు. మార్గదర్శుల ఎంపికలో ఎక్కడా వ్యతిరేకత రాకూడదని. ఎవరినీ బలవంతం చేయొద్దని అధికారులకు సీఎం సూచించారు. మానవత్వం ఉండే వారే ఇందులో చేరతారు. మంచి కార్యక్రమాలను అడ్డుకునేందుకు కొందరు రాక్షసుల తరహాలో వ్యవహరిస్తారు. ప్రజల మనస్సుల్లో దీనిపై వ్యతిరేకత తెచ్చేందుకు ప్రయత్నిస్తారని సీఎం అన్నారు. గతంలో జన్మభూమి, శ్రమదానం, నీరు-మీరు ఇలా ఏ కార్యక్రమం చేపట్టినా ఇదే విధంగా విమర్శించారని. నేను ఇలాంటివి పట్టించుకోనన్నారు. కొందరికి ఆర్ధిక వనరులు ఉన్నా పేదల్ని ఆదుకోవడానికి మనస్సు రాదని. కొందరికి మనస్సు ఉన్నా సమయం ఉండకపోవచ్చని. ఇలాంటి వారిని గుర్తించండని సీఎం అధికారులకు సూచించారు.. పీ4 వేదిక ఉందని చెప్పండి. ఆర్ధిక అసమానతలు మరింతగా తగ్గాలి. ఇవి పెరిగితే సమాజానికి మంచిది కాదు. ఇవాళ బంగారు కుటుంబంలో సాయం పొందిన వారే రేపు మార్గదర్శి కావచ్చ అన్నారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందుకుంటూనే బంగారు కుటుంబాలకు అదనపు సాయం పీ4 ద్వారా అందుతుందని. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు, పారిశ్రామిక వేత్తలను కలిసి వారిలో ఆలోచనను రేకెత్తించండి. అని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.