ఆంధ్రప్రదేశ్‌లోని ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు దసరా కానుకను ముందే ప్రకటించారు. అనంతరంలో జరిగిన సూపర్ సిక్స్, సూపర్ హిట్ సభ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఆటో మిత్ర కింద ఆటో డ్రైవర్లకు దసరా రోజున రూ.15 వేలు ఆర్థికసాయం చేస్తాం..అని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం. అన్ని వర్గాల ప్రభుత్వం. అందరి జీవితాలు మార్చే ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోదీ దసరాకు కానుక ఇస్తున్నారు... జీఎస్టీ సంస్కరణలు తెచ్చారు.. ధరలను తగ్గిస్తున్నారు. పన్నులను తగ్గించడం వంటి మంచి నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీని అభినందించాలి. యూనివర్సల్ హెల్త్ స్కీం తెచ్చాం. దీంతో పేదల వైద్య ఖర్చులు తగ్గుతాయి..అని చంద్రబాబు పేర్కొన్నారు.