గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..ఆ పథకం పునఃప్రారంభిస్తామని ప్రకటన

అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు

By Knakam Karthik
Published on : 14 April 2025 3:58 PM IST

Andrapradesh, CM Chandrababu, Ambedkar Overseas Scheme, Tdp, Ysrcp, Ys Jagan

గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..ఆ పథకం పునఃప్రారంభిస్తామని ప్రకటన

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో అంబేద్కర్ జయంతి సందర్భంగా వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్‌ పోరాడారు. రాజ్యాంగంలో హక్కులను అంబేద్కర్‌ పొందుపరిచారు. గత ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని తుంగలో తొక్కిందని, దానిని త్వరలోనే పునఃప్రారంభిస్తామని ప్రకటించారు.

విదేశాలలో చదవాలనే దళిత విద్యార్థుల కల.. కలగానే మిగిలిపోకూడదు. అందరితోపాటు వారు కూడా మంచి ఉన్నత విద్యను అభ్యసించాలి. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. రెసిడెన్షియల్ స్కూళ్లలో మెరుగైన భోజనం, నాణ్యమైన విద్య అందిస్తున్నాం. పేదలకు అండగా ఉంటానని అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతిష్ఠాత్మక వర్సిటీలు అమరావతికి తరలివస్తున్నాయి. సబ్‌ప్లాన్‌ ద్వారా దళితుల అభివృద్ధికి కృషి చేస్తాం. రెసిడెన్షియల్‌ స్కూళ్లలో మెరుగైన భోజనం, నాణ్యమైన విద్యను అందిస్తున్నాం... అని చంద్రబాబు తెలిపారు.

Next Story