ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో సీఎం చంద్రబాబు దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని వ్యవసాయం, మైనర్ ఇరిగేషన్ వంటి అంశాలపై చర్చించారు. ఇటీవల మొంథా తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరించారు సీఎం చంద్రబాబు. మైనర్ ఇరిగేషన్ కింద సాగు చేసే రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి సీఎం సహకారం కోరారు. పీఎం-ఆర్కేవివై-పీడీఎంసీ స్కీం కింద అదనపు నిధులు కేటాయించాలని వినతించారు. 2024-25, 2025-26 ఆర్ధిక సంవత్సరాలకు కలిపి రూ. 695 కోట్లు ఇవ్వాలని కోరారు సీఎం చంద్రబాబు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద తోతాపూరి రైతులకు ఇచ్చిన మద్దతు ధరలో కేంద్ర ప్రభుత్వ వాటాను విడుదల చేయాలని వినతించారు. కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఇవ్వాల్సిన రూ. 100 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం.