ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం "స్త్రీ శక్తి'ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో మహిళలకు ఉచిత బస్సు పథకం ఆయన ప్రారంభించారు. కాగా ఇవాళ్టి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుల్లోకి వచ్చినట్లయింది. మొత్తం 5 రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇందుకోసం ఏపీఎస్ఆర్టీసీ 8500 బస్సులను సిద్ధం చేసింది. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డులలో ఏదైనా కండకర్ట్‌కు చూపి బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం పేర్కొంది.