చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న ఖరారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించాక సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో తొలిసారి అడుగుపెట్టనున్నారు

By Medi Samrat  Published on  20 Jun 2024 7:02 PM IST
చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న ఖరారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించాక సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో తొలిసారి అడుగుపెట్టనున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. రెండు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం అయిన తర్వాత కుప్పంకు తొలిసారిగా చంద్రబాబు వస్తుండడంతో టీడీపీ నేతలు ఘన స్వాగతం పలకడానికి సిద్ధమయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అమరావతి రాజధాని ప్రాంతాన్ని సందర్శించి రాజధాని అభివృద్ధి పనుల స్థితిగతుల గురించి తెలుసుకున్నారు. ఏపీలో ఏ అంటే అమరావతి పీ అంటే పోలవరం అని అన్నారు సీఎం చంద్రబాబు.

2019లో జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక భవనం నుంచి సీఎం నాయుడు తన పర్యటనను ప్రారంభించారు. హిరోషిమా, నాగసాకిలను ప్రజలు గుర్తుపెట్టుకున్నట్లే జగన్‌మోహన్‌రెడ్డి విధ్వంసక పాలనను ప్రజలు గుర్తుంచుకునేలా ప్రజావేదిక శిథిలాలను ప్రభుత్వం అలాగే ఉంచుతుందని అన్నారు.

Next Story