Andrapradesh: రాష్ట్రంలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు

రాష్ట్రంలో ఎస్పీల బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు

By -  Knakam Karthik
Published on : 13 Sept 2025 5:47 PM IST

Andrapradesh, Amaravati, Cm Chandrababu, New SPs

అమరావతి: రాష్ట్రంలో ఎస్పీల బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. వీరిలో 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులకు అవకాశమిచ్చారు. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ అయ్యారు. మిగిలిన 12 జిల్లాలకు ఇప్పుడు ఉన్నవారినే కొనసాగించాలని నిర్ణయించారు.

ఎస్పీల బదిలీలను పరిశీలిస్తే బీఆర్ అంబేడ్కర్ కోనసీమకు రాహుల్ మీనా, బాపట్లకు ఉమామహేశ్వర్, నెల్లూరుకు అజితా వేజెండ్ల నియమితులయ్యారు. తిరుపతికి సుబ్బారాయుడు, అన్నమయ్య జిల్లాకు ధీరజ్ కునుగిలి, కడప జిల్లాకు నచికేత్, నంద్యాల్ జిల్లాకు సునీల్ షెరాన్ కొత్తగా నియమితులయ్యారు. వీరంతా కొత్తగా జిల్లాలకు ఎస్పీలుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇప్పటికే ఎస్పీలుగా కొనసాగుతున్న వారిలో ఎఆర్ దామోదర్​ను విజయనగరం జిల్లాకు, విద్యాసాగర్ నాయుడును కృష్ణాజిల్లాకు, వకుల్ జిందాల్​ను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. డి. కృష్ణారావును పల్నాడు జిల్లాకు, హర్షవర్థన్ రాజును ప్రకాశం జిల్లాకు, తుషార్ డూడిని చిత్తూరు జిల్లాకు,సతీష్ కుమార్​ ను శ్రీ సత్యసాయి జిల్లాకు బదిలీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాల ఎస్పీలు యథాతథంగా కొనసాగనున్నారు.

14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 7 జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ ఆదేశాల్లో పేర్కొన్నారు.

Next Story