గ్రామీణ యువతకు సీఎం చంద్రబాబు శుభవార్త.. త్వరలో అందుబాటులోకి ఆట స్థలాలు

మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

By అంజి  Published on  27 Sep 2024 1:07 AM GMT
CM Chandrababu, officials, playgrounds, villages, APnews

గ్రామీణ యువతకు సీఎం చంద్రబాబు శుభవార్త.. త్వరలో అందుబాటులోకి ఆట స్థలాలు

అమరావతి: మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. యువతను క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాలని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకు తగ్గట్టుగా స్టేడియాలు, క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. యూత్‌ సర్వీసెస్‌, క్రీడల శాఖపై అధికారులతో ఆయన రివ్యూ నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

గ్రామాల్లో ఆట స్థలాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన 35 క్రీడా వికాస కేంద్రాల పూర్తికి రూ.23 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. 2027లో వచ్చే జాతీయ క్రీడలు మన రాష్ట్రంలో నిర్వహించాలనేది లక్ష్యంగా పెట్టుకుని అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తిచేయాలన్నారు.

అంతకుముందు నైపుణ్య శిక్షణ శాఖ,ఎంఎస్‌ఎంఇ డిపార్ట్‌మెంట్, ఇండస్ట్రీస్, సెర్ప్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నేరేవేర్చే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు.

Next Story