ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివాహానికి హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్ రెడ్డి వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు విచ్చేశారు. వధూవరులు సుమేఘా రెడ్డి, మనోజ్ రెడ్డిలను ఆశీర్వదించారు. కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకంతోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందన్నారు. సుపరిపాలన అందిస్తే మంచి రాజకీయాలకు నాంది పలికినట్టే అని చంద్రబాబు తెలిపారు. ఢిల్లీలో బీజేపీ విజయంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో కూటమి నేతలు సెలెబ్రేషన్స్ మొదలెట్టారు.