ఇక నుంచి 'స్వర్ణగ్రామం'గా గ్రామ, వార్డు సచివాలయాలు..సీఎం కీలక ప్రకటన

గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్చనున్నట్లు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు ప్రకటించారు

By -  Knakam Karthik
Published on : 17 Dec 2025 4:04 PM IST

Andrapradesh, Amaravati, Cm Chandrababu, village and ward secretariats, Swarna Gramam

ఇక నుంచి 'స్వర్ణగ్రామం'గా గ్రామ, వార్డు సచివాలయాలు..సీఎం కీలక ప్రకటన

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్చనున్నట్లు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇకపై 'స్వర్ణగ్రామం'గా మారుస్తామని తెలిపారు. కాగా శాఖలు, జిల్లాల వారీగా కలెక్టర్ల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సూచనలు జారీ చేశారు. నిర్దేశిత గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇటీవల కాలంలో సుమారు 3 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాం. ఉగాది నాటికి మరో 5 లక్షల గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ప్రతి మూడు నెలలకు టార్గెట్ పెట్టుకుని ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి. గతంలో ఊళ్లకు దూరంగా ఇళ్ల స్థలాలు కేటాయించారు. కొందరు లబ్ధిదారులు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. తిరుపతి లాంటి నగరాల్లో ఈ సమస్య ఉంది. లబ్దిదారులతో సంప్రదించి ఇతర ప్రాంతాల్లో వారికి స్థలాలు కేటాయించాలి..అని సీఎం చంద్రబాబు సూచించారు.

Next Story