కుమార్తె పెళ్లి వేడుక... పాట పాడిన వైసీపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్‌.!

Chodavaram MLA karanam dharmasri sings in his daughter wedding. కుమార్తె పెళ్లి వేడుకలో పాటలు పాడి అందరిని అలరించారు వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. విశాఖలోని ఎంజీఎం పార్కులో

By అంజి
Published on : 24 Oct 2021 6:14 PM IST

కుమార్తె పెళ్లి వేడుక... పాట పాడిన వైసీపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్‌.!

కుమార్తె పెళ్లి వేడుకలో పాటలు పాడి అందరిని అలరించారు వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. విశాఖలోని ఎంజీఎం పార్కులో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె పెళ్లి చరణ్‌తో వైభవంగా జరిగింది. ఈ వేడుకలో పాట కచేరీని ఏర్పాటు చేశారు. కుమార్తె వివాహ వేడుకలో పాటల కచేరీలోని మైక్‌ అందుకుని ఉత్సాహంగా పాటలు ఆలపించారు. ఎవర్‌ గ్రీన్‌ సాంగ్‌ నన్ను దోచుకుందవతే వన్నెల దొరసాని అనే పాటను కరణం ధర్మ శ్రీ పాడి.. పెళ్లి వేడుకకు వచ్చిన వారిని ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివాహ వేడుకకు మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు, నాయకులు హాజరయ్యారు.

Next Story