వైఎస్ జగన్ పై ప్రశంసల వర్షం కురిపించిన మెగాస్టార్

Chiranjeevi Praises YS Jagan Govt Huge Vaccination. మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు.

By Medi Samrat  Published on  22 Jun 2021 7:55 AM GMT
వైఎస్ జగన్ పై ప్రశంసల వర్షం కురిపించిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. అయితే ఈ ప్రశంసలు ఎందుకనే కదా మీ డౌట్.. ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కారణంగానే..!

వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఒకేరోజు 6 లక్షల మందికి వ్యాక్సిన్‌లు ఇచ్చిన ప్రభుత్వం ఆదివారం తన రికార్డును తానే అధిగమించింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 లక్షల మందికి వ్యాక్సిన్ అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 2,232 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక డ్రైవ్‌ గా నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒక్కరోజులో ఏకంగా 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. 'ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య సిబ్బంది ఒకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేయ‌డం ఓ గొప్ప‌ పని అని.. దీని ప‌ట్ల చాలా సంతోషం వ్య‌క్తం చేస్తున్నాను. వైద్య సిబ్బంది కృషి ఫ‌లితంగా కొవిడ్ భూతాన్ని ఓడించ‌గ‌ల‌మ‌నే విశ్వాసం ప్ర‌తి ఒక్క‌రిలోనూ క‌లుగుతోంది. ఈ ప్ర‌య‌త్నాల‌ను కొనసాగించాలి. శ్రీ జ‌గ‌న్ గారిది స్ఫూర్తిదాయ‌క నాయ‌క‌త్వం.. ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను' అని చిరంజీవి ట్వీట్ చేశారు.Next Story
Share it