రామోజీ రావు మృతి పట్ల చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంతాపం

రామోజీరావు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి రామోజీ రావు మరణంపై ఎక్స్‌లో దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on  8 Jun 2024 11:49 AM IST
రామోజీ రావు మృతి పట్ల చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంతాపం

రామోజీరావు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి రామోజీ రావు మరణంపై ఎక్స్‌లో దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రామోజీ ఎవరికీ తలవంచని మేరు పర్వతమని కొనియాడారు. ‘‘ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివికెగిసింది’’ అని చిరంజీవి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ రామోజీరావు మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. అక్షర యోధుడు రామోజీ రావు గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని భావించానని.. రామోజీ రావు గారు ఇక లేరనే వార్త ఆవేదన కలిగించిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

రామోజీరావు శనివారం తెల్లవారు జామున 4.50 గంటలకు కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వైద్యులు స్టెంట్ అమర్చారు. ఆ తరువాత ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Next Story