రాష్ట్రానికి అప్పులు దొరకని స్థితికి తీసుకొచ్చారు

Chinna Rajappa Fires On CM Jagan. రాష్ట్రాభివృద్ధి విషయంలో సీఎం జగన్‌కు అంకితభావం, పట్టుదల లేవని, వచ్చిన అవకాశాన్ని

By Medi Samrat
Published on : 11 Oct 2021 7:36 PM IST

రాష్ట్రానికి అప్పులు దొరకని స్థితికి తీసుకొచ్చారు

రాష్ట్రాభివృద్ధి విషయంలో సీఎం జగన్‌కు అంకితభావం, పట్టుదల లేవని, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నఆలోచనలో ఆయన ఉన్నాడని, రోడ్లనిర్మాణం సహా, అనేక అభివృద్ధిపనులను ముఖ్యమంత్రి విస్మరించాడని, రాష్ట్ర ఆదాయం పెంచాలన్నఆలోచన లేకుండా పనిచేస్తున్నాడని, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టంచేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి అప్పులు దొరకని స్థితికి ముఖ్యమంత్రి ఏపీని తీసుకొచ్చాడని, ఆఖరికి జీతాలు, పింఛన్లు ఇవ్వలేని దుస్థితికి సర్కారు చేరిందన్నారు.

లక్షల రూపాయల జీతభత్యాలతో సలహాదారులను నియమిస్తున్న ముఖ్యమంత్రి, వారి సలహాలతోనే రాష్ట్రాన్ని ఈ విధంగా అన్నిరంగాల్లో అథోగతిపాలు చేస్తున్నారా అని మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిన నేపథ్యంలో రూ.44వేల కోట్ల చెల్లింపులను కాగ్ తప్పుపట్టినా ప్రభుత్వవైఖరిలో మార్పులేదన్నారు. కేంద్రంవద్ద తీసుకున్న రుణాలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో, రాష్ట్రానికి ఎక్కడా రూపాయి కూడా అప్పుదొరకడంలేదన్నారు. గతప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో, టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు.

టెండర్లు పడక, పనులుచేయడానికి ముందుకురాక, కాంట్రాక్టర్లం తారోడ్లపైకి వచ్చే దుస్థితిని ఈ ప్రభుత్వం కల్పించిదన్నారు. కమీషన్లు ఇచ్చేవారికి మాత్రమే బిల్లులుచెల్లిస్తున్న ప్రభుత్వం, తమకు అనుకూలమైన సంస్థలు, వ్యక్తులకే అనుకూలంగా వ్యవహరిస్తోంద న్నారు. ఎన్ఆర్ఈజీఎస్ బిల్లులకోసం కాంట్రాక్టర్లు కోర్టుని ఆశ్రయిస్తే తప్ప, ప్రభుత్వంలో చలనం రాలేదన్నారు. రాష్ట్రంలో రోడ్లన్నీ దారుణంగా తయారయ్యాయని, ముఖ్యమంత్రి వైఖరి చూస్తుంటే, అవి ఎప్పుడు బాగుపడతాయో కూడాతెలియని అయోమయ అవస్థలో ప్రజలు ఉన్నారని చినరాజప్ప తేల్చిచెప్పారు.


Next Story