ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో పలువురు విద్యార్ధులు నష్ట పోయేలా ఒకటి, రెండు చోట్ల జరిగిన తప్పిదాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. రీవాల్యూయేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న తర్వాత విద్యార్ధుల మార్కుల్లో వ్యత్యాసం కనిపించడాన్నితీవ్ర తప్పిదంగా ముఖ్యమంత్రి పరిగణించారు.
నష్టపోయిన విద్యార్ధులకు ఇంటర్ ప్రవేశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. తప్పిదానికి బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని, వెంటనే నివేదికను సమర్పించాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యవస్థాత్మక సంస్కరణలు తీసుకురావాలని ఆదేశించారు.