టువాస్ పోర్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం

ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం రెండో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా టువాస్ పోర్టును సందర్శించింది.

By Medi Samrat
Published on : 28 July 2025 4:57 PM IST

టువాస్ పోర్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం

ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం రెండో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా టువాస్ పోర్టును సందర్శించింది. టువాస్ పోర్టు సందర్శనలో భాగంగా పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథార్టీ రీజనల్ సీఈఓ విన్సెంట్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద కంటైనర్ టెర్మినల్ పోర్టుగా టువాస్ పోర్టును నిర్మిస్తున్నట్టు సింగపూర్ పోర్టు అథార్టీ అధికారులు వెల్లడించారు. టువాస్ పోర్టులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సుతో కూడిన ఆటోమేషన్ వ్యవస్థను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఏపీలో మరిన్ని పోర్టుల నిర్మాణం చేపట్టాలనే ప్రణాళికలు సిద్దం చేస్తోన్న దృష్ట్యా సీఎం చంద్రబాబు, మంత్రులు టువాస్ పోర్టును సందర్శించారు.

ఏపీ పోర్టుల్లోనూ ఆపరేషన్స్, కార్గో హ్యాండ్లింగ్ తదితర అంశాల్లో ఆటోమేషన్, ఏఐ టెక్నాలజీని వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, పారిశ్రామిక కారిడార్లతో ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు టువాస్ పోర్టు అనుసరిస్తున్న విధానాలు ఎంత వరకు ఉపయోగపడాతాయోననే అంశంపై అధ్యయనం చేస్తుంది. పోర్టు ఆధారిత పరిశ్రమలు, కార్యాకలాపాలు నిర్వహణపైనా టువాస్ పోర్టు అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఏపీ పోర్టులను సింగపూర్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే అవకాశాలపై సింగపూర్ అధికారులతో ముఖ్యమంత్రి బృందం సమాలోచనలు జ‌రిపింది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్, నారాయణ, భరత్, ఏపీ అధికారులు టువాస్ పోర్టును పరిశీలించారు.

Next Story