దివ్యాంగ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ఈ క్రమంలోనే మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు బస్సు ప్రయాణించారు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి నేతలు ప్రయాణించనున్నారు. సుమారు 11 కిమీ మేర దివ్యాంగులతో కలిసి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్‌లు బస్సులో ప్రయాణం ఉంటుంది.
ఈ క్రమంలోనే ప్రజా ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ అడిగి తెలుసుకుంటారు. పథకం ప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు, లబ్దిదారులు తరలి వచ్చారు.