రెండో జాబితాకు ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు

టీడీపీ ఇప్పటికే 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని తెలిపారు

By Medi Samrat  Published on  13 March 2024 3:30 PM GMT
రెండో జాబితాకు ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు

టీడీపీ ఇప్పటికే 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని తెలిపారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని అన్నారు. జనసేన, బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నదానిపై ఆ రెండు పార్టీల వారికి స్పష్టత ఉందని.. సమయానుకూలంగా ఆ రెండు పార్టీలు కూడా వారి అభ్యర్థులను ప్రకటిస్తాయని స్పష్టం చేశారు.

బీజేపీ పదేళ్లుగా కేంద్రంలో ఉంది.. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీనే వస్తుందని అందరూ చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. దక్షిణాదిలో ఎక్కువ సీట్లు రాకపోయినా, ఉత్తరాదిలో వారిదే ప్రభంజనం అంటున్నారు.. రాష్ట్రాన్ని పునర్ నిర్మించాలంటే నిధులు, అనుమతులు, క్లియరెన్సులు ఇలా అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా అవసరమన్నారు చంద్రబాబు. ఇక్కడ నేను గెలిచినా కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్ర పునర్ నిర్మాణం చేయలేమన్నారు చంద్రబాబు. టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోకపోతే ఓట్లు చీలిపోయి మళ్లీ వీళ్లే గెలుస్తారని.. రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని అన్నారు చంద్రబాబు నాయుడు. సీట్ల పంపకం అయిపోయిన తర్వాత కూడా జనసేన పార్టీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఓటు చీలకూడదని.. నేను కూడా గర్వానికి పోలేదన్నారు. నేను 14 ఏళ్లు సీఎంగా చేశాను, కేంద్రంలోనూ చక్రం తిప్పామని తెలిపారు చంద్రబాబు. ప్రజాహితం కోసం, ప్రజల భవిష్యత్ కోసం అందరం రాజీపడ్డామని తెలిపారు.

Next Story