కేక్ కట్ చేసిన చంద్రబాబు.. ఎందుకోసమంటే..?

Chandrababu Vastunna Meekosam Padayatra Completed 10 Years. పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారనే సెంటిమెంట్ ను నిజం చేసిన మరో వ్యక్తి టీడీపీ అధినేత

By Medi Samrat  Published on  2 Oct 2022 7:30 PM IST
కేక్ కట్ చేసిన చంద్రబాబు.. ఎందుకోసమంటే..?

పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారనే సెంటిమెంట్ ను నిజం చేసిన మరో వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 2014లో ఆయన అధికారంలోకి రావడానికి పాదయాత్రనే కారణమని అంటుంటారు. తాజాగా ఆ క్షణాలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 2012లో చేసిన 'వస్తున్నా మీకోసం పాదయాత్రకు నేటితో 10 ఏళ్లు పూర్తీ అయింది. ఈసందర్భంగా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు అధినేత చంద్రబాబు నాయుడును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. పాదయాత్ర విశేషాలను గుర్తు చేసుకున్నారు. కార్యకర్తల కోరిక మేరకు చంద్రబాబు కేక్ కట్ చేశారు. 2012 అక్టోబర్ 2న ప్రారంభమైన వస్తున్నా మీకోసం పాదయాత్ర 208 రోజుల పాటు సాగింది. 63 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు 2817 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్, గోనుగుంట్ల కోటేశ్వరరావు, చంద్రదండు ప్రకాష్ నాయుడు, ప్రకాష్ రెడ్డి, సత్యనారాయణ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.


Next Story