చంద్రబాబు తొందరపడి ఆ ట్వీట్ చేశారా..?

Chandrababu Tweet. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ వైపు బహిరంగంగా వైసీపీ ప్రభుత్వం మీదనూ

By Medi Samrat  Published on  19 Dec 2020 7:46 PM IST
చంద్రబాబు తొందరపడి ఆ ట్వీట్ చేశారా..?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ వైపు బహిరంగంగా వైసీపీ ప్రభుత్వం మీదనూ, ఆ పార్టీ కార్యకర్తల మీదనూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే సోషల్ మీడియాలో కూడా ఆయన ఏ మాత్రం తగ్గడం లేదు. అధికార వైసీపీ మీద విమర్శల మీద విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లో వైసీపీని ఇరుకునపెట్టాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.

చంద్ర‌బాబు తాజాగా చేసిన ట్వీట్ పై వైసీపీ నేత‌లు, అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. చంద్ర‌బాబు ఓ వీడియో లింక్‌ను పెట్టి ట్వీట్ చేశారు. దానికి ట్యాగ్ చేసిన ఫొటోలో ఒక పోలీసు అధికారిని మ‌రో వ్య‌క్తి.. కొడుతున్న‌ట్టే క‌నిపిస్తుంది. రాష్ట్రంలో ఎంత దారుణాలు చోటు చేసుకుంటున్నాయో.. చెప్పేందుకు ఇదే ఉదాహ‌ర‌ణ‌... ఓ పోలీసు అధికారిని వైసీపీ గూండాలు.. చిత‌క్కొడుతున్నా.. అడిగే దిక్కు‌లేకుండా పోయింది. అంటూ చంద్ర‌బాబు ఆ వీడియో కింద పోస్టు చేశారు.


విశాఖ‌లో టీడీపీ ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు ఆఫీస్ ద‌గ్గ‌ర ఇలా పోలీసును కొడుతున్నార‌ని, దీనిని బ‌ట్టి రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు ఎలా ఉన్నాయో అర్ధ‌మ‌వుతుందని, పోలీసుల‌కే ర‌క్ష‌ణ లేకుండా పోయింది.. అని ఇంగ్లీష్‌లో కామెంట్ చేశారు. చంద్రబాబు ట్వీట్ అంటే మీడియా ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. స‌ద‌రు పోలీసు అధికారినే వివ‌ర‌ణ కోరింది.

నేను విధుల్లో ఉన్నాన‌ని, వెనుక వచ్చిన ఆటో దూసుకుంటూ వెళ్ల‌డంతో ప‌ట్టుత‌ప్పి నేల‌పై ప‌డిపోయానని, వెంట‌నే అటుగా వెళ్తున్న వైసీపీ నాయ‌కులు గమనించి న‌న్ను పైకిలేపి.. నీళ్లు తాగించారని పోలీసు అధికారి వివ‌ర‌ణ ఇచ్చారు. చంద్ర‌బాబు ట్వీట్‌కు ప్ర‌తిస్పంద‌న‌గా వైసీపీ శ్రేణులు సెటైర్లు వేస్తూ ట్వీట్ చేస్తున్నారు. చంద్ర‌బాబు ఇలా తొంద‌ర‌ప‌డి పోస్టు పెట్టారని కౌంటర్ల మీద కౌంటర్లు, సెటైర్ల మీద సెటైర్లు వేస్తూ ఉన్నారు. ప్రత్యర్థులను ఇరుకునపెట్టాలని అనుకోవాలంటే.. ఇలా ఆయనే ఫేక్ పోస్టు పెట్టి ఇరుక్కుపోయారు.




Next Story