టీడీపీ నుండి ఆ నేతలను సస్పెండ్ చేసిన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొందరు టీడీపీ నేతలపై షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రెబల్ అభ్యర్థులను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు

By Medi Samrat
Published on : 30 April 2024 8:45 AM IST

టీడీపీ నుండి ఆ నేతలను సస్పెండ్ చేసిన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొందరు టీడీపీ నేతలపై షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రెబల్ అభ్యర్థులను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సివేరి అబ్రహం (అరకు నియోజకవర్గం), మీసాల గీత (విజయనగరం నియోజకవర్గం), పరమట శ్యాంసుందర్‌ (అమలాపురం నియోజకవర్గం), ముడియం సూర్యచంద్రరావు (పోలవరం నియోజకవర్గం), వేటుకూరి వెంకట శివరామరాజు (ఉండి నియోజకవర్గం), జడ్డా రాజశేఖర్‌ (సత్యవేడు నియోజకవర్గం)ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు.

ఇక కొందరు రెబల్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. తమ నామినేషన్లను వెనక్కు తీసుకున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా దాఖలు చేసిన నామినేషన్‌ను మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వెనక్కు తీసుకున్నారు. తన అనుచరుడితో విత్‍డ్రా ఫామ్‍పై సంతకం చేసి ముద్రబోయిన పంపించారు. ముద్దరబోయిన కుటుంబ సభ్యులు కూడా తమ నామినేషన్లు వెనక్కు తీసుకున్నారు.

Next Story