చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్.. పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించడంపై ఆంధ్రప్రదేశ్‌లోని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.
By అంజి
చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్.. పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్
ఏపీ: స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును నాయుడికి విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. చంద్రబాబుకు రిమాండ్ విధించడంపై ఆంధ్రప్రదేశ్‌లోని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వైఎస్ జగన్ దేశంలోనే ధనిక సీఎం అన్న పవన్ కల్యాణ్.. ఆయన ఏం పనిచేశాడో తెలియదు కానీ, భారీగా ఆస్తులు మాత్రం పెరిగిపోయాయని అన్నారు. అక్రమంగా డబ్బులు సంపాదించినవారు నేడు మిగతావారిని నేరగాళ్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్ అన్నారు. తాను చంద్రబాబుకు మద్దతు తెలపాలని అనుకున్నానని, మన కోసం ఒక వ్యక్తి నిలబడినప్పుడు మనం తిరిగి వారి కోసం నిలబడాలి. అంతేకానీ తాను నేరుగా ఏసీబీ కోర్టుకు వెళ్తున్నానని, ఊహించుకొని శాంతి, భద్రతల సమస్యను సృష్టించారని, తానేమీ కోర్టుకు వెళ్లాలి అనుకోలేదని తెలిపారు.
కోనసీమలో వారాహి యాత్ర చేస్తున్న సమయంలో 2 వేల మంది నేరగాళ్లను దించారని అన్నారు. మీరు (పాలక వర్గం) నేరాలు చేస్తే మీరే భయపడాలి. కానీ, తానేందుకు భయపడతానన్నారు. ఇలాంటి పనులన్నీ తనకు, జనసేనతోపాటు టీడీపీకి కూడా బలాన్ని ఇస్తున్నాయని పవన్ అన్నారు. వైఎస్ జగన్ బెయిలు మీద వచ్చి ముఖ్యమంత్రి అయ్యారని, చట్టాలను చక్కగా అమలుచేస్తే అసలు ఇలాంటి వాళ్లు ముఖ్యమంత్రి కాలేరని పవన్ కామెంట్ చేశారు. దివ్యాంగులను బెదిరిస్తావు, ప్రజలను, అధికారులను బెదిరిస్తావు, పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశావు అంటూ సీఎం జగన్‌పై పవన్ ఫైర్ అయ్యారు. జీ20 నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ అరెస్టు చేయించారని పవన్ అన్నారు. ''కారులో ఉండనివ్వవు. హోటల్ రూమ్ లోనుంచి బయటకు రానివ్వవు. మరి ఇంకేం చేయమంటావు. నాలాంటి ప్రజాదరణ ఉన్న నాయకుడికే ఇలా చేస్తే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి'' అని పవన్ ప్రశ్నించారు.