అరెస్టు తర్వాత చంద్రబాబు స్పందన ఇదే..!

By Medi Samrat  Published on  9 Sept 2023 9:54 AM IST
అరెస్టు తర్వాత చంద్రబాబు స్పందన ఇదే..!

తనను ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు అరెస్టు చేయడంపై తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. తాను ఏం చేశానో చెప్పుకుండా అరెస్టు చేశారని మీడియాతో అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని.. ప్రాథమిక ఆధారాలు చూపకుండా, తాను చేసిన నేరం ఏమిటో నిరూపించకుండా అరెస్టు చేశారని, అది చాలా తప్పు అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏమైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని ఆయన అన్నారు. అర్ధరాత్రి వచ్చి అందరినీ భయబ్రాంతులను చేసి తనను అరెస్టు చేశామని చెప్పారని ఆయన అన్నారు. తానేమైనా టెర్రరిస్టునా అని చంద్రబాబు ప్రశ్నించారు. మాకు అధికారం ఉంది, ఏమైనా చేసుకుంటామనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారని.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనను అడ్డుకోవడానికి, ప్రజలను భయబ్రాంతులను చేయడానికి తనను అరెస్టు చేశారని అన్నారు. తాను ఏం చేశానో చెప్పకుండా చేయడం ప్రాథమిక హక్కులను భంగపరచడమేనని ఆయన అన్నారు. సామాన్యుడికి కూడా ప్రాథమిక హక్కులుంటాయని ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాల్సి ఉంటుందని, కానీ ఏమీ చెప్పలేదని, చాలా బాధేస్తోందని అన్నారు.

Next Story