పాముకాటుతో విద్యార్ధి మృతి బాధాకరం.. ప్రభుత్వం బాధ్యత వహించాలి : చంద్రబాబు

Chandrababu On Student Death. విజయనగరం జిల్లా కురుపాంలోని ప్రభుత్వ వసతిగృహంలోని విద్యార్ధి పాము కాటుకు గురై మృతి చెందడం

By Medi Samrat  Published on  4 March 2022 1:41 PM IST
పాముకాటుతో విద్యార్ధి మృతి బాధాకరం.. ప్రభుత్వం బాధ్యత వహించాలి : చంద్రబాబు

విజయనగరం జిల్లా కురుపాంలోని ప్రభుత్వ వసతిగృహంలోని విద్యార్ధి పాము కాటుకు గురై మృతి చెందడం ఆందోళనకు గురి చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు కలిగిన విద్యార్ధులు.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమ‌ని విచారం వ్య‌క్తం చేశారు. గతంలో వసతి గృహాల్లో ఉండే వసతి సదుపాయాలు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ చూసి.. సీట్ల కోసం ముందుకొచ్చిన విద్యార్ధులు.. ఈ రోజు ప్రాణాలతో ఉండాలంటే వసతి గృహాల్లో చేరకుండా ఉంటే మేలు అనే పరిస్థితికి జగన్ రెడ్డి దిగజార్చారని ఆరోపించారు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాల్సిన వసతి గృహాల్లో సదుపాయాల లేమి, భద్రత లేమి చూసి విద్యార్ధులు, తల్లిదండ్రులు భయపడే పరిస్థితి కల్పించారని చంద్ర‌బాబు అన్నారు. కురుపాంలో జరిగిన ఘటనకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు.


Next Story