కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు గుప్పించారు. బడ్జెట్ ప్రజలకు ఆశాజనకంగా లేదని, రైతులు, పేదల కోసం ప్రభుత్వం చేస్తున్నది ఇందులో ఏమీలేదని అభిప్రాయపడ్డారు. బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఊరట లభించలేదని ఆరోపించారు. నదుల అనుసంధానంపై కేంద్రం యొక్క ప్రణాళికలను చంద్రబాబు ప్రశంసించారు. అలాగే డిజిటల్, సోలార్ రంగంలో సంస్కరణలను ఆహ్వానించారు.
రాష్ట్ర ప్రయోజనాల సాధనలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు మరోసారి విఫలమయ్యారని చంద్రబాబు ఆరోపించారు. 28 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం సాధించారని నిలదీశారు. మంగళవారం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నాలుగోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సుమారు గంటన్నర సేపు మాట్లాడిన నిర్మలా సీతారామన్.. ఈ ఏడాది ఆర్థిక లోటు 6.9 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.