అక్రమాలకు పాల్పడుతున్న వారిని వదిలి ప్రతిపక్షాన్ని వేధించడమేంటి.? : చంద్రబాబు

Chandrababu Naidu Questions Police. మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలను వదలి ప్రశ్నించిన

By Medi Samrat
Published on : 14 Nov 2021 2:08 PM

అక్రమాలకు పాల్పడుతున్న వారిని వదిలి ప్రతిపక్షాన్ని వేధించడమేంటి.? : చంద్రబాబు

మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలను వదలి ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకొని వేధించడం దుర్మార్గమ‌ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పంలో నోట్ల కట్టలు పంచుతూ పట్టుబడ్డ వైసీపీ నేతలను అదుపులోకి తీసుకోకుండా తెలుగుదేశం కేడర్ ను పోలీసులు బెదిరించడం అనైతికం, అప్రజాస్వామికం అని ఫైర్ అయ్యారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చేవారిని అడ్డుకోవడం నేరమా? ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అని ప్ర‌శ్నించారు.

నెల్లూరులో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా వ్యవహరిస్తున్న కప్పిర శ్రీనివాసులు అనే టీడీపీ నాయకుడిని మంత్రి అనిల్ కుమార్ వారం రోజులుగా పోలీస్ స్టేషన్ కు పిలిపించి వేధించడం వైసీపీ నాయకుల శాడిస్టు, సైకో మనస్థత్వానికి నిదర్శనమ‌ని మండిప‌డ్డారు. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడని.. శ్రీనివాసులుకు ఎటువంటి ప్రాణహాని జరిగినా మంత్రి అనిల్ కుమార్ బాధ్యత వహించాలని అన్నారు. చట్టానికి విరుద్దంగా వ్యవహరించిన పోలీసులు న్యాయస్థానం ముందు తలవంచుకుని నిలబడాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు.


Next Story