'నాడు- నేడు' అంటే 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడమేనా?

Chandrababu Naidu Fire On Govt. నాడు-నేడు అంటూ మూడేళ్ళుగా ప్రభుత్వం చేసిన ఆర్భాటపు ప్రచారానికి,

By Medi Samrat  Published on  7 Jun 2022 12:06 PM GMT
నాడు- నేడు అంటే 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడమేనా?

నాడు-నేడు అంటూ మూడేళ్ళుగా ప్రభుత్వం చేసిన ఆర్భాటపు ప్రచారానికి, నిన్న వచ్చిన పదో తరగతి ఫలితాలకి పొంతనే లేదని టీడీపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో 90-95 శాతం ఉన్న ఉత్తీర్ణత.. ఇప్పుడు 67 శాతానికి పడిపోవడం.. రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థ దుస్థితికి నిదర్శనమ‌ని దుయ్య‌బ‌ట్టారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లేకపోవడం, వారికి బోధనేతర పనులు అప్పగించడం, బడుల విలీనం సహా ప్రభుత్వం తీసుకున్న పలు అస్తవ్యస్థ విధానాలే నేటి ఈ పరిస్థితికి కారణమ‌ని విమ‌ర్శించారు.

సీఎం జగన్ చెప్పిన నాడు-నేడు అంటే లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడమేనా? విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేదనకు గురి చెయ్యడమేనా? అని ప్ర‌శ్నల వ‌ర్షం కురిపించారు. రెండు లక్షలమందికి పైగా విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఇక్కడ ఫెయిల్ అయ్యింది ప్రభుత్వ వ్యవస్థలే తప్ప.. విద్యార్థులు కాదు.. అని అంతా గుర్తించాలని చంద్రబాబు అన్నారు. పరీక్షల్లో తప్పామని విద్యార్థులు ఆత్మహత్యల వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని సూచించారు. స్టూడెంట్స్ ధైర్యంగా ఉండాలని అన్నారు. వ్యవస్థలో లోపాలకు మీరు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని చంద్ర‌బాబు నాయుడు విద్యార్థి లోకానికి విజ్ఞప్తి చేశారు.












Next Story