పవన్‌తో చంద్ర‌బాబు భేటీ

Chandrababu Meet With Pawan Kalyan. టీడీపీ అధినేత‌ చంద్రబాబు విజ‌య‌వాడ‌ నోవాటెల్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తో భేటీ అయ్యారు.

By Medi Samrat
Published on : 18 Oct 2022 4:12 PM IST

పవన్‌తో చంద్ర‌బాబు భేటీ

టీడీపీ అధినేత‌ చంద్రబాబు విజ‌య‌వాడ‌ నోవాటెల్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్ర‌స్తుత‌ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరువురూ చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీపై తీవ్రమైన‌ చ‌ర్చ న‌డుస్తోంది. విశాఖలో చోటు చేసుకున్న ఘటనలపై చంద్రబాబు ప‌వ‌న్‌కు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తుండ‌గా.. మ‌రోవైపు రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరువురూ ఉమ్మడి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంద‌ని అంటున్నారు.

ఇదిలావుంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వైఎస్సార్సీపీ నేతలు తనపై చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. తనతో యుద్ధం ఎలా ఉంటుందో చూపిస్తానని అధికార పార్టీ నేతలను హెచ్చరించారు. 'ప్యాకేజీ స్టార్' అంటూ తనను విమర్శించిన వైఎస్సార్సీపీ నేతలకు చెప్పుతో కొడతానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలా చెబుతూనే షూ కూడా చూపించారు. ఆయ‌న‌ ఇంకా మాట్లాడుతూ..''నన్ను తక్కువ అంచనా వేయకండి. నేను సన్నగా కనిపించవచ్చు.. కానీ వారిని ఒంటరిగా ఎదుర్కొనేంత బలంగా ఉన్నాను.'' అని అన్నారు.




Next Story