అభిమాని కోసం ఆస్ప‌త్రికి వెళ్లిన‌ చంద్ర‌బాబు

Chandrababu Meet Party Worker in Hospital. కృష్ణా జిల్లా ప్ర‌సాదంపాడుకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ కార్య‌క‌ర్త‌,

By Medi Samrat  Published on  13 Aug 2021 2:57 PM GMT
అభిమాని కోసం ఆస్ప‌త్రికి వెళ్లిన‌ చంద్ర‌బాబు

కృష్ణా జిల్లా ప్ర‌సాదంపాడుకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ కార్య‌క‌ర్త‌, అభిమాని బొప్పన రాఘ‌వేంద్ర‌రావు చావుబ‌తుకుల్లో విజ‌య‌వాడ‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుని చూడాల‌న్న‌ది రాఘ‌వేంద్ర‌రావు చివ‌రి కోరిక. బంధువులు ఈ స‌మాచారాన్ని చంద్ర‌బాబుకు చేరేలా చేశారు. అమ‌రావ‌తి నుంచి హైద‌రాబాద్ వెళ్లేందుకు సిద్ధ‌మైన చంద్ర‌బాబు.. విష‌యం తెలియ‌డంతో హుటాహుటిన ఆస్ప‌త్రికి వ‌చ్చారు. రాఘవేంద్రరావుని ప‌రామ‌ర్శించారు. రాఘవేంద్రరావు.. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ కృష్ణా జిల్లాలో టీడీపీకి క‌ర‌డుగ‌ట్టిన కార్య‌క‌ర్త‌గా.. నాయ‌కుడిగా పార్టీకి విస్తృత సేవలందించారు రాఘ‌వేంద్ర‌రావు.

రాఘవేంద్రరావు దుర్గాపురం ప్రాంత కార్పోరేటర్ గా, వీజీటియం వుడా స‌భ్యులుగా ప‌నిచేశారు. వ‌యోభారంతో వ‌చ్చిన ఆరోగ్య‌ స‌మ‌స్య‌ల‌తో ఆస్ప‌త్రిలో చేరిన రాఘ‌వేంద్ర‌రావు ప‌రిస్థితి విష‌మంగా వుంది. నిన్ను చూసేందుకు చంద్ర‌బాబు వ‌స్తున్నారని బంధువులు చెప్ప‌డంతో.. కొన ఊపిరిని కొన‌సాగించేలా శ‌క్తిని కూడ‌దీసుకున్నారు. అమ‌రావ‌తి నుంచి హైద‌రాబాద్ వెళ్లేందుకు సిద్ధ‌మై.. ఎయిర్‌పోర్ట్ కి వెళ్లాల్సిన కాన్వాయ్‌ని హాస్పిట‌ల్‌కి అర్జంటుగా మ‌ళ్లించండి అంటూ ఆదేశాలిచ్చి.. ఆగ‌మేఘాల‌పై వ‌చ్చి ప‌రామ‌ర్శించారు. త‌న అభిమాన‌ నాయ‌కుడిని చూశాన‌న్న తృప్తి రాఘ‌వేంద్ర‌రావు క‌ళ్ల‌ల్లో క‌నిపించిందని బంధువులు తెలిపారు.


Next Story
Share it