చంద్రబాబు సంచలన ప్రెస్ మీట్.. రాష్ట్రపతి పాలన విధించాలంటూ..
Chandrababu Latest Press Meet comments. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రేరిపిత టెర్రరిజం కొనసాగుతోందని, దీనిపై భారత ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశామని
By అంజి Published on 25 Oct 2021 2:27 PM ISTఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రేరిపిత టెర్రరిజం కొనసాగుతోందని, దీనిపై భారత ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశామని టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలిపారు. ఢిల్లీలో రాష్ట్రపతితో భేటీ అయిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. దేశంలో డ్రగ్స్, గంజాయి ఎక్కడా పట్టుబడ్డా.. దాని మూలం మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఉందని వివిధ రాష్ట్రాల పోలీసులు చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు. డ్రగ్స్ కారణంగా యువత పెడదారి పడుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరితే.. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారన్నారు. రాష్ట్ర టీడీపీ కార్యాలయంపై దాడి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమేనని చంద్రబాబు ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని లిక్కర్ బ్రాండ్లు.. కేవలం ఏపీలోనే ఉన్నాయని, మద్యం నిషేధం అంటూ భారీగా రేట్లు పెంచారని చంద్రబాబు ఆక్షేపించారు. డ్రగ్స్ ఫ్రీ ఏపీ కోసం టీడీపీ పోరాడుతోందని చంద్రబాబు చెప్పారు.
రాష్ట్రంలో రెండేళ్లుగా ఉన్మాద పాలన సాగుతోందని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని, అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తూ టీడీపీ నాయకులను శారీరక హింసలకు గురి చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై రాష్ట్రపతికి వివరించామని తెలిపారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్రపతి పాలన విధించాలని కోరామన్నారు. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడి ఘటనను సీబీఐ విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశామని చంద్రబాబు చెప్పారు. టీడీపీ ప్రజాస్వామ్యయుతంగా పోరాటం సాగిస్తుందని, దోషులకు కఠిన శిక్ష పడే వరకు ఉద్యమం సాగుతుందని చంద్రబాబు తెలిపారు.