మళ్లీ గెలిచి రావాలనే పట్టుదలతో ఇవాళ్టి నుంచే పనిచేయండని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు. టీడీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మీరందరూ మళ్లీ గెలివాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక కష్టాలు ఉన్నా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాం.. మీ పనితీరుపై నేను ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పిస్తున్నానన్నారు. నేను త్వరలో మీతో ముఖాముఖి మాట్లాడతా.. పార్టీని వదిలేస్తే అందరం మునుగుతాం.. అందుకనే పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలపై దృష్టి పెట్టండి.. మీరు వాళ్లను కలుపుకుని వెళితేనే ముందుకు వెళ్లగలుగుతామని దిశానిర్దేశం చేశారు. పార్టీని, పార్టీ కార్యకర్తలను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దన్నారు. దెబ్బతిన్న రోడ్లను రెండు నెలల్లో పూర్తి చేయాలి.. నియోజకవర్గంలో పనులపైనా దృష్టి పెట్టండని సీఎం చంద్రబాబు సూచించారు.