నా వయసు 72 ఏళ్లు.. కానీ 27 ఏళ్ల వాడిలా పని చేస్తా

Chandrababu Fire On CM Jagan. అసెంబ్లీలో నాపై వ్యక్తి గత దూషణలు చేస్తే.. శపథం చేసి బయటకు వచ్చాన‌ని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

By Medi Samrat  Published on  20 May 2022 8:15 PM IST
నా వయసు 72 ఏళ్లు.. కానీ 27 ఏళ్ల వాడిలా పని చేస్తా

అసెంబ్లీలో నాపై వ్యక్తి గత దూషణలు చేస్తే.. శపథం చేసి బయటకు వచ్చాన‌ని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అనంతపురంలో బాదుడే బాదుడు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న అనంత‌రం సభలో మాట్లాడుతూ.. అసెంబ్లీని గౌరవ సభగా మార్చి సభకు వెళతానని అన్నారు. హంద్రీనీవా కాలువ పనులు ఏమయ్యాయి.. హంద్రీనీవా పై జగన్ గాలి మాటలు చెప్పలేదా? అంటూ ప్ర‌శ్నించారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేసే ప్రయత్నం చేశానని.. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా ఆపేశారని ఆరోపించారు.

కార్యకర్తలు పార్టీకి లాయల్ గా ఉండాలి. పార్టీని నిలబెట్టేది వాళ్లే. కార్యకర్తలు లేకపోతే నాయకులు లేరు.. అలాగే కమిటీ వాళ్ల పని వాళ్లు చెయ్యాలని అన్నారు. ముందుగా అభ్యర్థులను ప్రకటించాలని కార్యకర్తలు కోరుతున్నారని.. సమర్థత, పని తీరు చూసి ముందుగా ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటిస్తాన‌ని తెలిపారు.

అనంతపురం జిల్లాలో వేరుశనగ రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారని.. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రావడం లేదు.. ఇన్స్సూరెన్స్ రావడం లేదని అన్నారు. హంద్రీనీవా కోసం పయ్యావుల, భైరవానితిప్ప కోసం కాలువ శ్రీనివాసులు వెంట పడేవారని గుర్తుచేశారు. క్రమశిక్షణ లేని ఇల్లు మనుగడ సాగించలేదని. పార్టీ కూడా అంతేన‌ని అన్నారు. పార్టీలో విచ్చలవిడిగా మాట్లాడితే కఠినంగా ఉంటానని అన్నారు.

పులివెందుల బస్ స్టాండ్ కట్టలేని జగన్.. మూడు రాజధానులు కడతాడా అని విమ‌ర్శించారు. వైసిపి దొంగ ఓట్ల పై క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్టీ నాయకులు నా చుట్టూ తిరిగితే లాభం లేదు.. కార్యకర్తల కోసం పని చెయ్యండని అన్నారు. నా దగ్గరకు వచ్చి నన్ను మోహమాట పెడితే ఇకపై కుదరదని తేల్చి చెప్పారు. 40 శాతం సీట్లు ఈ సారి యువతకు సీట్లు ఇస్తానని.. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికీ అవకాశం ఇస్తానని.. నా వయసు 72 ఏళ్లు కానీ 27 ఏళ్ల వాడిలా పని చేస్తాన‌ని అన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా న్యూట్రిఫుల్ అనే యాప్ ను ప్రారంభిస్తున్నాన‌ని తెలిపారు. కార్యకర్తలకు వైద్యం కోసం ప్రముఖ అసుపత్రులతో ఒప్పందం చేసుకుందామ‌ని అన్నారు.



















Next Story