తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ సూర్యాపేట జిల్లా నార్కట్‌పల్లి సమీపంలో జాతీయ రహదారిపై కాన్వాయ్ కాసేపు నిలిచిపోయింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా.. క్లచ్ ప్లేట్లలో లోపం తలెత్తినట్లు గుర్తించిన డ్రైవర్ వెంటనే వాహానాన్ని నిలిపివేశారు. దీంతో మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారు.