కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు.. ఆ అభ్యర్థుల మార్పు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి ప్రచారం చేస్తున్నాయి.
By Medi Samrat Published on 21 April 2024 8:51 PM ISTఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి ప్రచారం చేస్తున్నాయి. పొత్తులో భాగంగా కొన్ని స్థానాల్లో అభ్యర్థుల విషయంలో ఊహించని గందరగోళం నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా ఒకానొక సమయంలో నిరసన సెగ తగిలింది. ఏదైతే అది అనుకుంటూ.. జాబితాను ప్రకటించి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలుండగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగింది. బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో పోటీకి దిగింది.
ఓ వైపు నామినేషన్లు కొనసాగుతూ ఉండగా.. కొన్ని చోట్ల కూటమిలో అభ్యర్థుల మార్పు కొనసాగుతుంది. తాజాగా టీడీపీ ఐదుచోట్ల అసెంబ్లీ అభ్యర్థులను మార్చింది. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి, ఉండి టికెట్ రఘురామకృష్ణరాజు, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్‌కుమార్ పేరును ఇంతకు ముందు ప్రకటించగా ప్రస్తుతం ఎమ్మెస్ రాజుకు కేటాయించారు. మాడుగుల టికెట్ బండారు సత్యనారాయణమూర్తి కి అవకాశం కల్పించారు. వెంకటగిరికి సంబంధించి రామకృష్ణకు బీ ఫారమ్‌ను ఇచ్చింది టీడీపీ. ఎంపీగా రఘు రామ పోటీ చేస్తారని ఆఖరి నిమిషం వరకూ అనుకున్నప్పటికీ.. ఆయన ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు.