ఇవాళ 'జయహో బీసీ సభ'.. హాజరవనున్న చంద్రబాబు, పవన్‌

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్షాలు కాలు దువ్వుకుంటున్నాయి.

By అంజి  Published on  5 March 2024 2:21 AM GMT
chandrababu, pawan kalyan , bc declaration, APnews

ఇవాళ 'జయహో బీసీ సభ'.. హాజరవనున్న చంద్రబాబు, పవన్‌

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్షాలు కాలు దువ్వుకుంటున్నాయి. టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ఇవాళ జయహో బీసీ సభ జరగనుంది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఏఎన్‌యూ ఎదురుగా ఉన్న స్థలంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ హాజరవనున్నారు. బీసీల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఈ మీటింగ్‌లో వారు ప్రకటించనున్నారు. ఇందు కోసం సాధికార కమిటీల ద్వారా బీసీల నుంచి వినతులను స్వీకరించారు.

బీసీల సమగ్రాభివృద్ధి, సంరక్షణ కోసం టీడీపీ-జనసేన కూటమి మంగళవారం బీసీ డిక్లరేషన్‌ విడుదల చేయనుంది. బీసీ డిక్లరేషన్‌కు సంబంధించి వివిధ అంశాలను చర్చించేందుకు సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. టీడీపీ ఆవిర్భావం నాటి నుంచి బీసీలు పార్టీకి బలమైన మద్దతుదారులుగా నిలబడ్డారని, వారి ఉన్న తి కోసం టీడీపీ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని టీడీపీ నేత అచ్చెన్నాయుడు తెలిపారు. బీసీల సమగ్రాభివృద్ధి కోసం నిర్దిష్ట విధానాలు, చర్యలతో సమగ్ర బీసీ డిక్లరేషన్‌ను చంద్రబాబు, పవన్‌ విడుదల చేస్తారని చెప్పారు. ఇవాళ్టి సభకు బీసీలు భారీ సంఖ్యలో రావాలని నేతలు పిలుపు ఇచ్చారు.

Next Story