భారీ వర్షాలు.. రైతులకు ఏపీ ప్రభుత్వం హెచ్చరిక

అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేసింది.

By అంజి  Published on  9 Dec 2024 1:30 AM GMT
heavy rain, AP government, farmers, APnews

భారీ వర్షాలు.. రైతులకు ఏపీ ప్రభుత్వం హెచ్చరిక

అమరావతి: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేసింది. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కోతకి సిద్ధంగా ఉన్న వరి పంటను వర్షాలకు ముందు కోయరాదని సూచించింది. కోసినా పూర్తి ఆరని వాటిని కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేస్తే నష్ట శాతం నివారించవచ్చంది.

భారీ వర్షాలతో ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కోత కోసిన వరిని వెంటనే సమీపంలోని రైస్‌ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. కోత కోసిన వరిని రక్షించేందుకు టార్పాలిన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు వర్షాలు పడే సమయంలో పంట కోత కోయకుండా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

Next Story